News November 29, 2024
మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం!
TG: కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వనున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో టీపీసీసీ తీర్మానం చేసింది. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టభద్రుల స్థానాన్ని నిలుపుకోవాలని నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.
Similar News
News December 7, 2024
TFDC ఛైర్మన్‌గా నిర్మాత దిల్ రాజు
TG: సినీ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజును నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. కాగా గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరఫున MP లేదా MLAగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. తెర వెనుక ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు టాక్.
News December 7, 2024
గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు
ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఖాన్ యూనిస్‌లో ఉన్న శరణార్థి శిబిరంలోని ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ శిబిరం వద్ద మహిళలు, బాలికలు ఆహారం కోసం పోటీపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి ఆహారం పంపిణీ చేసింది. కానీ ఇటీవల దానిని నిలిపివేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఆహారం అందటం లేదు.
News December 7, 2024
‘RRR’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప-2’
ఓపెనింగ్ డేలో రూ.294 కోట్లు <<14809048>>కొల్లగొట్టిన<<>> పుష్ప-2 భారత సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ RRR పేరిట ఉండేది. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.223 కోట్లు రాబట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ను పుష్పరాజ్ బద్దలుకొట్టారు. ఇక నిన్న, ఇవాళ కలిపి ఈ చిత్రం రూ.400 కోట్లపైనే వసూళ్లు చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అంటున్నాయి.