News September 10, 2025

JGTL: క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన SP

image

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మంగళవారం జిల్లా కేంద్రానికి చెందిన పలువురు క్రికెట్ క్రీడాకారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహించే జగిత్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జగిత్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

ఉండి: ఫలించిన ప్రియురాలు ధర్నా.. కథ సుఖాంతం

image

ఉండి మండలం మహాదేవపట్నం శివారు రామచంద్రపురానికి చెందిన భానుప్రకాష్ ఇంటి ముందు సోమవారం సాయంత్రం ప్రియురాలు దుర్గాభవాని కుటుంబ సమేతంగా సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి వ్యవహారం ఉండి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో ఎట్టకేలకు ప్రియుడు దిగివచ్చాడు. పెళ్లి చేసికోవడానికి అంగీకరించాడు. పెద్దల సమక్షంలో పత్రాలు రాయడంతో కథ సుఖాంతమైంది.

News December 17, 2025

ధోనీకి ఇదే చివరి IPL: ఊతప్ప

image

రానున్న IPL సీజనే ధోనీకి చివరిదని CSK మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు. ఆపై ఎడిషన్‌లో ఆడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే అదే అర్థమవుతోందన్నారు. ‘గతేడాది, తాజాగా జరిగిన మినీ వేలంలోనూ యంగ్ క్రికెటర్లపై CSK ఎక్కువగా ఖర్చు చేసింది. అలాగే రుతురాజ్, శాంసన్ వంటి సారథులు జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో ధోనీ టీం నుంచి తప్పుకొని మెంటార్‌గా కొనసాగే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.

News December 17, 2025

IPL వేలం.. రాజస్థాన్ టీమ్‌లో కరీంనగర్‌ కుర్రాడు

image

ఐపీఎల్ వేలంలో కరీంనగర్ అబ్బాయి అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ టీం రూ.30 లక్షలకు దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన అతణ్ని అంతే ధరకు సొంత చేసుకుంది. ఇప్పటికే HCA అండర్-19, అండర్-23 విభాగాలలో అద్భుత ప్రదర్శన చేశారు. అండర్-23 SMATలో 160+ స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. అయితే IPLలో రాణించి కరీంనగర్‌కు పేరు తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.