News September 9, 2025

JGTL: గణేష్ నిమజ్జనం డ్యూటీ.. పోలీస్ శాఖకు ఉత్సవ సమితీ సన్మానం

image

జగిత్యాల పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా రెండు రోజుల గణేష్ నిమజ్జనం శాంతియుతంగా ముగియడంతో పోలీస్ శాఖకు గణేష్ ఉత్సవ సమితీ, విశ్వహిందూ పరిషత్ కృతజ్ఞతలు తెలిపింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, సీఐ కరుణాకర్, ఎస్ఐలు కుమారస్వామి, రాజుకిరణ్, సుప్రియ, మల్లేశంలకు సమితీ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితీ, VHP నాయకులు, భజరంగ్ దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News December 10, 2025

NZB: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

నిజామాబాద్‌లో ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ 3పై రైలు ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. ప్లాట్‌ఫామ్, రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలై స్పాట్‌లోనే మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుందని, కుడిచేతి మధ్యవేలు లేదని గుర్తించారు. కేసు నమోదు చేశారు.

News December 10, 2025

బాపట్ల: ఇకపై భూ సమస్యలు సచివాలయంలోనే పరిష్కారం

image

నిషేధిత భూముల జాబితా నుంచి భూమి తొలగింపునకు గ్రామ/వార్డు సచివాలయంలో నామమాత్ర రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వెబ్ ల్యాండ్ సవరణలు, IGRS పేర్ల తొలగింపు, భూమి స్వభావ మార్పు, సబ్ డివిజన్ వంటి సేవలకు రూ.50 నుంచి 150 వరకు సచివాలయంలో రుసుం చెల్లిస్తే సరిపోతుందన్నారు.

News December 10, 2025

వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

image

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.