News September 10, 2025

JGTL: జిల్లా ఉపాధ్యాయుడి అరుదైన ఘనత

image

గొల్లపల్లి మం. వెనుగుమట్ల HS జీవశాస్త్ర టీచర్ తిరుపతి 2వ సారి జాతీయస్థాయి శిక్షణ సదస్సుకి హాజరవుతూ అరుదైన ఘనత సాధించారు. 2021లో ఒకసారి, ఇప్పుడు సీసీఆర్టీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు నిర్వహిస్తున్న ఎన్ఈపీ- 2020 ఓరియంటేషన్‌కు రాష్ట్రంలో 10మంది నిష్ణాతులైన టీచర్లను ఎంపిక చేయగా, జిల్లా నుంచి తిరుపతి ఎంపికయ్యారు. ఈనెల 8-27వరకు 21రోజులు HYD మాదాపూర్లో శిక్షణ ఇవ్వనున్నారు.

Similar News

News December 7, 2025

764 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌లో 764 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌-B 561, టెక్నీషియన్-A 203 పోస్టులున్నాయి. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ https://www.drdo.gov.in/లో అందుబాటులో ఉంటుంది.

News December 7, 2025

NRPT: రేపు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం

image

రేపు సోమవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని ప్రజలు తమ సమస్యలను 08506 281182 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. సమస్యలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పరు. జిల్లా ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News December 7, 2025

KMR: కేంద్ర మంత్రిని కలిసిన పైడి ఎల్లారెడ్డి

image

హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు డా.పైడి ఎల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో జరుగుతున్న సర్పంచి ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇరువురు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాలను ప్రజలకు చేరువ చేసి, పార్టీ పటిష్టత పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.