News August 23, 2025

JGTL: ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడి మృతి

image

ట్రాక్టర్ పైనుంచి కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన మెట్‌పల్లి మం. వెల్లుల్ల శివారులో తెల్లవారుజామున జరిగింది. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నర్ర శేఖర్ (27) ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడడంతో ట్రాక్టర్ వెనుక టైర్ అతడిపై నుంచి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 19, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, BRS నేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉ.11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. హరీశ్ పాత్రపై ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో BRS కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా? అనేది ఆసక్తిగా మారింది.

News January 19, 2026

జగిత్యాల: వేసవికి ముందస్తు తాగునీటి ప్రణాళికలు

image

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ప్రణాళికలను ముందస్తుగా అమలు చేయాలని జగిత్యాల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వహించిన జిల్లా నీటి, పారిశుధ్య కమిటీ సమావేశంలో నీటి సరఫరా, నాణ్యత, ఎఫ్‌హెచ్‌టీసీల పురోగతి, ఆపరేషన్ పనులను సమీక్షించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించాలని సూచించారు.

News January 19, 2026

నల్గొండ: ఇంటర్ కాలేజీలకు నిధులు మంజూరు

image

నల్గొండ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ప్రాక్టికల్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.6.50 లక్షలను కేటాయించింది. ఈ పరికరాల సరఫరా కోసం అర్హులైన సంస్థల నుండి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.