News November 17, 2025

JGTL: నేడే క్యాబినెట్ భేటీ.. రిజర్వేషన్ల పంచాయితీ తేలేనా..?

image

బీసీ రిజర్వేషన్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర క్యాబినెట్ భేటీ నేడు జరగనుండగా, ఎన్నికలపై ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. రోజులు గడిచేకొద్దీ ఎన్నికలు ఎప్పుడూ జరుగుతాయోనని ఆశావహులంతా ఎదురుచూస్తున్నారు. కనీసం నేటితోనైనా ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి. కాగా ఉమ్మడి జిల్లాలో 1216 GPలు, 60 ZPTCలు, 646 MPTC స్థానాలున్నాయి.

Similar News

News January 20, 2026

ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవం

image

సింహాచలంలో ఈఏడాది ఏప్రిల్ 20న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం జరగనుంది. సంబంధిత ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు

News January 20, 2026

బాస్ ఈజ్ బ్యాక్.. MSVPGపై బన్నీ ప్రశంసలు!

image

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ‘బాస్ ఈజ్ బ్యాక్.. స్క్రీన్‌పై వింటేజ్ వైబ్స్ చూడటం ఆనందంగా ఉంది. వెంకటేశ్ నటన, అనిల్ డైరెక్షన్, నయన్- కేథరిన్ పర్ఫార్మెన్స్‌ అదుర్స్. ఇది బ్లాక్ బస్టర్ కాదు.. బాస్-బస్టర్. నిర్మాత సుస్మిత కొణిదెల, సాంకేతిక బృందానికి శుభాకాంక్షలు. సంక్రాంతికి రావడం.. హిట్ కొట్టడం అనిల్‌కు ఆనవాయితీగా మారింది’ అని పేర్కొన్నారు.

News January 20, 2026

రేపు మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఆయా మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని డీఈఓ ఆదేశించారు.