News March 10, 2025
JGTL: మిస్సింగ్ అయిన మహిళ మృతి

మిస్సింగ్ అయిన ఓ మహిళ మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్‌లో లభ్యమైంది. మాల్యాల ఎస్ఐ నరేశ్ కుమార్ కథనం మేరకు.. ఓబులాపూర్ గ్రామానికి చెందిన జైసేట్టి వెంకవ్వ(50) ఈ నెల 6న రాత్రి 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని భర్త గంగన్న ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆదివారం జగిత్యాల మండలం అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో వెంకవ్వ మృతి చెంది కనిపించింది.
Similar News
News January 24, 2026
భూపాలపల్లి జిల్లాను రద్దు చేయడం ఎవరి తరం కాదు: ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మండిపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి జిల్లాను భూకంపం వస్తే తప్ప రద్దు చేయడం ఎవ్వరితరం కాదని అన్నారు. కొందరు సన్నాసులు సీఎం రేవంత్ రెడ్డిపై అబద్దాలను ప్రచారం చేస్తు మున్సిపల్ ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నరని అన్నారు. దమ్ముంటే నిజాయితీగా కొట్లాడాలని సవాల్ విసిరారు.
News January 24, 2026
KNR: ఆర్టీసీకి 14 రోజుల్లో రూ.46.37 కోట్ల ఆదాయం

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.
News January 24, 2026
సిరిసిల్ల: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించారు. ఈ మేరకు ఇంఛార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్లెక్సిపై బాలికలను ఉద్దేశించి స్కై ఇస్ ద లిమిట్ అని రాశారు.


