News March 14, 2025
JNGM: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

జనగామలో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
Similar News
News February 18, 2026
CM రిక్వెస్ట్.. కుప్పంలో 2 ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపింగ్

CM చంద్రబాబు రిక్వెస్ట్ నేపథ్యంలో కుప్పంలో 2 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 10న CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కుప్పంలో వాస్కోడగామా-వేలంకణి, దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 రైళ్ల స్టాపింగ్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్రమంత్రి CM చంద్రబాబుకు లేఖ రాశారు.
News February 18, 2026
నాకు క్లీన్ చిట్ వచ్చింది.. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’పై ట్రంప్

లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో నేను రహస్యంగా దాచుకోవడానికి ఏమీ లేదు. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కోర్టు కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఎప్‌స్టీన్ తనకు వ్యతిరేకంగా పని చేసినట్లు ఆరోపించారు.
News February 18, 2026
జపం ఎక్కడ చేస్తే ఉత్తమ ఫలితాలు?

జపం చేసే స్థలం, ఆసనాన్ని బట్టి ఫలితం మారుతుందని శాస్త్ర వచనం. వాటి ప్రకారం.. ఉన్ని వస్త్రంపై జపం వంశవృద్ధిని, పర్వత శిఖరంపై జపం తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఇంట్లో చేసే జపం సాధారణ ఫలితం, నదీ తీరంలో చేస్తే అంతకన్నా 2 రెట్లు, గోశాలలో 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. తిరుమల, కాశీ, శ్రీశైలం వంటి స్వయంభూ క్షేత్రాల్లో చేసే జపానికి కోటి రెట్ల ఫలితం ఉంటుంది. సూర్యుడు, గురువు, దీపానికి అభిముఖంగా జపం చేయాలి.


