News October 5, 2025
పవర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

పవర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 7వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసోసియేట్, అసోసియేట్, అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://powerfoundation.org.in/
Similar News
News January 19, 2026
ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.
News January 19, 2026
నాకు పెళ్లి కాలేదు: డింపుల్ హయాతి

తనకు పెళ్లి అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ డింపుల్ హయాతి ఖండించారు. ‘ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది’ అని ఓ నెటిజన్ SMలో కామెంట్ చేయగా ‘నాకు పెళ్లి కాలేదు’ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. డింపుల్, ఆమె భర్త డేవిడ్‌పై పోలీస్ కేసు నమోదైందంటూ సదరు నెటిజన్ ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేయగా అది ఫేక్ అని ఆమె బదులిచ్చారు. కాగా డింపుల్ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది.
News January 19, 2026
2030 కల్లా అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా భారత్: SBI

భారత్ ఆర్థికంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని SBI తాజా రిపోర్ట్ వెల్లడించింది. 2028 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపింది. 2030నాటికి ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ దేశాల క్లబ్‌లో చేరనుందని పేర్కొంది. అప్పటికీ మన తలసరి ఆదాయం $4,000 (దాదాపు రూ.3,63,541) మార్కును తాకడం ఖాయమని అంచనావేసింది. 2047నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలవనుందని తెలిపింది.


