News September 13, 2025

JRG: వర్జీనియా పొగాకు ధర అధరహో

image

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్‌ టైమ్‌ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 8, 2025

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: పవన్

image

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, ఆధ్యాత్మిక శాస్త్రమని AP Dy.CM పవన్ అన్నారు. ‘TNలో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలి. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. ముఖ్యంగా యువత గీత చదవాలి. మనసు కుంగినా, ఆలోచనలు అయోమయంలోకి నెట్టినా గీత ఓ కౌన్సిలర్‌, మెంటర్‌గా పనిచేస్తుంది’ అని ఉడుపి క్షేత్రంలో చెప్పారు.

News December 8, 2025

పర్మినెంట్ హామీపై ఉమ్మడి నల్గొండ హోంగార్డుల ఆశలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న 1,200 మంది హోంగార్డులు పర్మినెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు 12 గంటలు పనిచేసినా, కేవలం ₹1000 వేతనంతో నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2003లో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు అమలు కాకపోవడంతో వారి పరిస్థితి మారలేదు. పర్మినెంట్ చేయకపోవడంపై హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 8, 2025

ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనం గర్వపడాలి: విజయ్

image

ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని IND మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌‌లో మాట్లాడుతూ.. ‘ధోనీ సహజ, ప్రత్యేకమైన నాయకుడు. ఆయనలా నిర్ణయాలు తీసుకోవడం మరొకరికి సాధ్యం కాదు. 2007 T20 WC చివరి ఓవర్ జోగిందర్ శర్మతో వేయించడం ఇలాంటిదే. ధోనీ కొట్టే సిక్సర్ల రేంజ్ మరో రైట్ హ్యాండ్ బ్యాటర్‌ వల్ల కాదు’ అని వ్యాఖ్యానించారు. మహీ కెప్టెన్సీలో విజయ్ 8 సీజన్ల పాటు CSKకు ఆడారు.