News July 28, 2024
జూలై 28: చరిత్రలో ఈరోజు
✒ 1909: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి జననం
✒ 1972: నక్సల్బరీ ఉద్యమ నేత చారు మజుందార్ మరణం
✒ 1976: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి మరణం
✒ 1976: అభ్యుదయ రచయిత శ్రీనివాస చక్రవర్తి మరణం
✒ 1983: తమిళ్ హీరో ధనుష్ జననం
✒ 2019: మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మరణం
✒ ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
Similar News
News December 12, 2024
BREAKING: వైసీపీకి మరో షాక్
AP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని <<14855229>>వీడిన<<>> విషయం తెలిసిందే.
News December 12, 2024
జమిలి ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం
దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. గతంలో కోవింద్ కమిటీ సిఫారసులకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News December 12, 2024
బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైంది: బండి సంజయ్
తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.