News March 12, 2025

K.V.N చక్రధరబాబుకు చిత్తూరు జిల్లా బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా ప్రత్యేకాధికారిగా K.V.N చక్రధరబాబు IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.

Similar News

News February 17, 2026

చిత్తూరు: అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకతవకలు.?

image

జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుప్పం(M)లో ఇంటర్వ్యూలకు కొందరు కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరయ్యారు. వాటిని అధికారులు రిజెక్ట్ చేశారు. కొంతమంది National institute of Open Schoolలో 10th చదివినట్లు సర్టిఫికెట్లు చూపించి ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఇలాంటి సర్టిఫికెట్లతో మరెంత మంది ఉద్యోగాల్లో చేరారన్నది చర్చనీయాంశంగా మారింది.

News February 17, 2026

మదనపల్లె: నిందితుడి ఇంట్లోనే బాలిక డెడ్‌బాడీ!

image

మదనపల్లెలో చిన్నారి <<19166799>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నిందితుడి ఇంట్లోనే బాలిక మృతదేహం ఉంది. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఇప్పటికీ అప్పజెప్పలేదు. ఇంట్లోకి వెళ్లకుండా బాలిక బంధువులు, స్థానికులు అడ్డుకుంటున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి కడప ఎస్పీ విశ్వనాథ్ వచ్చారు. మరికాసేపట్లో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సైతం రానున్నారు.

News February 16, 2026

చిత్తూరు SP పరిష్కార వేధికకు 36 అర్జీలు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.