News November 23, 2024

పోలీస్ స్టేషన్‌లోని మెయిన్ సీట్‌లో కాల భైరవుడి ఫొటో!

image

ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ప్రధాన అధికారిగా SHO ఉంటారు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి పోలీస్ స్టేషన్‌లో మాత్రం కాశీ విశ్వనాథుడి రూపమైన కాలభైరవుడు ఉంటారు. స్టేషన్‌లో ప్రత్యేకంగా కుర్చీలో ఫొటో పెట్టి, టోపీ, బల్ల ఉంచుతారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని విధులు నిర్వహిస్తారు. స్వామికి పూజలు చేశాకే విధులు మొదలుపెడతారు. భైరవుడిని ‘కొత్వాల్’ అని పిలుస్తుంటారు.

Similar News

News November 23, 2024

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, CM దిగ్భ్రాంతి

image

AP: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు <<14688076>>ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గార్లదిన్నె మం. కలగాసుపల్లె వద్ద ఆర్టీసీ బస్సు 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఇద్దరు, ఆస్పత్రిలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

News November 23, 2024

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి శిండే?

image

మ‌హారాష్ట్రలో మ‌హాయుతి భారీ విజ‌యం సాధించ‌డంతో CM పీఠంపై ఉత్కంఠ నెల‌కొంది. కూట‌మిలో అత్య‌ధికంగా 132 సీట్ల‌లో ముందంజ‌లో ఉన్న BJP CM ప‌ద‌విని వ‌దులుకోకపోవచ్చు. దీంతో ఏక్‌నాథ్ శిండే, అజిత్ ప‌రిస్థితి ఏంటనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో శిండేకు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వాలని BJP యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అజిత్‌ను మాత్రం Dy.CMగా కొన‌సాగించవచ్చని సమాచారం.

News November 23, 2024

ప్రియాంక గురించి ఇందిరా గాంధీ మాటల్లో

image

ప్రియాంకా గాంధీ గురించి ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 1984లో తన హ‌త్య‌కు 2 రోజుల ముందు సెక్రటరీతో ఇందిరా గాంధీ మాట్లాడుతూ ‘నేను ఎక్కువ రోజులు బ‌తక్కపోవ‌చ్చు. కానీ మీరు ప్రియాంక ఎదుగుద‌ల‌ను చూస్తారు. ప్ర‌జ‌లు ఆమెలో న‌న్ను చూసుకుంటారు. ఆమెను చూసిన‌ప్పుడు న‌న్ను గుర్తు చేసుకుంటారు. ప్రియాంక ఎంతో సాధిస్తుంది. త‌రువాతి శ‌తాబ్దం ఆమెదే. ప్ర‌జ‌లు న‌న్ను మ‌రిచిపోతారు’ అని వ్యాఖ్యానించారు.