News May 19, 2024

22న కల్కి సాంగ్ రిలీజ్!

image

‘కల్కి 2898AD’ మూవీ అప్‌డేట్స్‌పై మేకర్స్ స్పీడ్ పెంచారు. తాజా ఇందులోని బుజ్జి పాత్రకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నెల 22న ప్రత్యేక ప్రచార చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇందుకోసం నిర్వహించే భారీ వేడుకకు ప్రభాస్‌తో పాటు చిత్రబృందమంతా పాల్గొననుంది. అభిమానుల మధ్య పాటను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. జూన్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Similar News

News December 11, 2024

గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు

image

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గీతా పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. ఇవాళ గీతా జయంతి సందర్భంగా 5వేల మందికి‌పైగా భక్తులు ‘కర్మ యోగ్’ అధ్యాయాన్ని పఠించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడంపై సీఎం మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని గోశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.

News December 11, 2024

విప‌క్షాల మాదిరి ప్ర‌శ్నించ‌కండి అంటూ సెటైర్లు

image

మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ హౌసింగ్ సొసైటీ విపక్ష రాజకీయ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. Dec 15న జరగనున్న సొసైటీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే, ఓడిపోయిన వారు విపక్షాల మాదిరి ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తవద్దని సూచించడం వైరల్‌గా మారింది. పోలింగ్‌పై భరోసా ఉంచాలని కోరింది. మూడేళ్లపాటు సొసైటీ బాధ్యతల్ని పర్యవేక్షించే కమిటీ ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమని పేర్కొంది.

News December 11, 2024

ఎల్లుండి స్వర్ణాంధ్ర-2047 విజన్ విడుదల

image

AP: డిసెంబర్ 13న స్వర్ణాంధ్ర విజన్-2047ను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ స్థాయిలో ఈ విజన్ రూపొందించామన్నారు. దీని ఆధారంగానే రాష్ట్రంలో పరిపాలన ఉండాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం వెల్లడించారు. 15శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుని కలెక్టర్లు ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందని సీఎం వెల్లడించారు.