News March 8, 2025
కాలిఫోర్నియా గవర్నర్‌గా కమలా హారిస్ పోటీ?

భారత సంతతి అమెరికా నేత కమలా హారిస్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. 2024లో డెమోక్రాట్ల తరఫున US అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమల ట్రంప్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2028లో జరిగే ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ మెంబర్ గావిన్ న్యూసమ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు.
Similar News
News January 13, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరు <
News January 13, 2026
కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన మీనాక్షి

తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నటుడు, డాక్టర్ అవ్వకూడదని హీరోయిన్ మీనాక్షి చౌదరీ అన్నారు. అంతేకాకుండా మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి ఉండకూడదని తెలిపారు. ఎందుకంటే తాను ఇప్పటికే ఆ హోదాల్లో ఉన్నానని చెప్పారు. అయితే తన ఫేవరెట్ డిష్ రాజ్మా 100 ఎకరాల్లో పండించే వ్యక్తి కావాలని తెలిపారు. హైట్ ఉండటంతో పాటు కుకింగ్ తెలిసి ఉండాలన్నారు. కాగా ఆమె నటించిన ‘అనగనగా ఒక రాజు’ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.
News January 13, 2026
డిఫెన్స్ పటిష్ఠతపై కేంద్రం దృష్టి

ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ బడ్జెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. US సహా పలు దేశాలు ఇప్పటికే డిఫెన్స్‌కు అధిక నిధులు కేటాయిస్తున్నాయి. ఇటు చైనా తన సైనిక శక్తిని విస్తరిస్తోంది. ఈ తరుణంలో మన ’రక్షణ’పై కేంద్రం దృష్టి సారించింది. గత బడ్జెట్లో ₹6.8L CR డిఫెన్స్‌కు కేటాయించింది. ఈసారి అది మరింత పెరగొచ్చని జియోజిత్ ఇన్వెస్టుమెంట్స్ చీఫ్ విజయకుమార్ పేర్కొన్నారు.


