News December 2, 2025

Karnataka: సిద్ద-శివ నాటు చికెన్ ‘బ్రేక్‌ఫాస్ట్’

image

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ బెంగళూరులో శివకుమార్ ఇంట్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఇడ్లీ, దోశ, ఉప్మా, నాటు చికెన్‌‌ అల్పాహారంగా తీసుకున్నారు. సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు CMకు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా CM అంశంపై ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News February 17, 2026

మొక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి విషపు ఎర తయారీ విధానం

image

మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడిలో సాయంకాలం వేయాలి. దీని కోసం ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని 2-3 లీటర్ల నీటిలో కరిగించి తర్వాత తవుడులో కలిపి ఆ మిశ్రమాన్ని 24 గంటల పాటు పులియనిచ్చి, అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ మందును కలిపి విషపు ఎరను మొక్క సుడిలో వేయాలి.

News February 17, 2026

అల్లు అర్జున్‌‌కు క్షమాపణలు చెప్పిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి

image

అల్లు అర్జున్‌ను కలవాలంటే <<19101939>>42 రూల్స్<<>> పాటించాలని తాను చేసిన వ్యాఖ్యలపై బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా సారీ చెప్పారు. ‘పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతుండగా ఫ్లోలో ఆ వ్యాఖ్యలు చేశా. అందులో నిజం లేదు. “42 డూస్, డోంట్స్” డాక్యుమెంట్ అబద్ధం. నాకు ఎవరూ ఇవ్వలేదు’ అని బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. ఆ పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి కూడా పబ్లిక్‌గా అపాలజీ చెప్పారు. కాగా అంతకుముందు ఈ ఆరోపణలను బన్నీ టీమ్ <<19103408>>ఖండించింది<<>>.

News February 17, 2026

అసెంబ్లీలో మూగబోయిన మైకులు

image

AP: అసెంబ్లీ మైకుల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు సభల్లో గంటకు పైగా అంతరాయం ఏర్పడింది. ఉదయం యథావిధిగా 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగా, సభ్యుల స్థానాల్లోని మైకులు పనిచేయలేదు. స్పీకర్ గంటపాటు సభను వాయిదా వేశారు. తర్వాత సమస్యను టెక్నీషియన్లు పరిష్కరించగా ఉ.11:30 గంటల నుంచి సభ తిరిగి ప్రారంభమైంది. శాసన మండలి కూడా ఉ.11 గంటలకు ప్రారంభమైంది. సమస్య తలెత్తడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.