News February 8, 2025

కరుణ్ నాయర్ మరో సెంచరీ

image

డొమెస్టిక్ క్రికెట్‌లో విదర్భ ప్లేయర్ <<15137627>>కరుణ్ నాయర్<<>> వీరవిహారం చేస్తున్నారు. రంజీ క్వార్టర్ ఫైనల్-2లో భాగంగా తమిళనాడుతో మ్యాచులో ఆయన మరో సెంచరీ బాదారు. 180 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. కాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ కరుణ్ 5 సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీమ్ ఇండియాకు సెలక్ట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌కు BCCI ఎంపిక చేయలేదు.

Similar News

News February 18, 2026

భారత వ్యతిరేక శక్తులతో రాహుల్‌కు సంబంధాలు: రిజిజు

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత వ్యతిరేక శక్తులతో ఆయనకు సంబంధాలున్నాయన్నారు. దేశ భద్రతకు ఆయన అత్యంత ప్రమాదకరమని మండిపడ్డారు. నక్సలైట్లు, తీవ్రవాదులను రాహుల్ కలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు జార్జ్ సొరోస్ వంటి నేతలను కలుస్తున్నారని ANIతో చెప్పారు.

News February 18, 2026

ఇంటర్వ్యూతో హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

image

HYDలోని <>ECIL<<>> 18 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి FEB 20న ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి PG, PGDM(మెటీరియల్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). DV, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40K చెల్లిస్తారు. సైట్: www.ecil.co.in/

News February 18, 2026

రాష్ట్రంలో నేటి నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభం

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి శనగల కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. రబీలో 3.25 లక్షల హెక్టార్లలో పంట సాగవగా.. 3.77 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వ అంచనా. కేంద్రం ఆదేశాలతో కనీస మద్దతు ధరల పథకం కింద 94,500 టన్నుల శనగలను కొనుగోలు చేయనున్నారు. పంట అమ్మకానికి అన్నదాతలు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని, పంట కొనుగోలు చేసిన 15 రోజుల్లో నగదు చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.