News April 2, 2024
కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో? – 1/3

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో జరగనున్న తొలి లోక్‌సభ ఎన్నికలు కావడంతో అక్కడి ప్రజల తీర్పుపై ఆసక్తి నెలకొంది. జమ్మూలో పట్టు సాధించిన BJP కశ్మీర్‌లోనూ ఖాతా తెరవాలనుకుంటోంది. గుజ్జర్లు, ST వర్గంలో చేర్చినందుకు పహారీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనేది బీజేపీ అంచనా. అనంత్‌నాగ్ నియోజకవర్గంలోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో వీరి ఓటు బ్యాంక్ ఎక్కువ. బారాముల్లాలో సైతం వీరి ఓటు బ్యాంక్ ఉంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News February 18, 2026
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. అభి ఫామ్‌లోకి వచ్చేనా?

T20 WCలో భారత్ ఇవాళ తన చివరి లీగ్ మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సూపర్-8కు ముందు ప్లేయర్ల ప్రాక్టీస్‌కు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా గంపెడు ఆశలు పెట్టుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళైనా ఫామ్‌లోకి రావాలి. గత 2 మ్యాచుల్లో అతడు డకౌట్ అయ్యారు. ఇక తిలక్ వర్మ తన ఆటలో దూకుడు పెంచాల్సి ఉంది. టాపార్డర్ విఫలమైతే సూర్య, హార్దిక్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలి. బౌలర్లంతా బాగానే రాణిస్తున్నారు.
News February 18, 2026
BREAKING: రూ.5వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా సిల్వర్ రేటు మాత్రం తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,60,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,200, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,41,350గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 18, 2026
స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు కోల్పోయి 83,399 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 25,719 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, HCL టెక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, బెల్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.


