News March 26, 2024
ఈడీ ముందుకు కవిత మేనల్లుడు!

TG: ఓ వైపు కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ కస్టడీ విధించగా.. మరోవైపు ఈడీ విచారణ కొనసాగిస్తోంది. కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఈడీ విచారిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో నగదు బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఆయనను అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఇదే కేసులో అదుపులోకి తీసుకొని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 16, 2026
ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.
News February 16, 2026
రోకో.. స్టైల్ అదుర్స్

టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ 38, 37 ఏళ్ల స్టార్ ప్లేయర్ల లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రోహిత్ శర్మ బరువు తగ్గి, ఫిట్‌గా, స్టైలిష్‌గా మారిపోయారు. అటు ఇండియాకు వచ్చిన విరాట్ తనదైన స్వాగ్‌తో అదుర్స్ అనిపించారు.
News February 16, 2026
రేపు స్కూళ్లలో ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

AP: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీల్లో రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరగనుంది. 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. 400MG ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని అధికారులు పేర్కొన్నారు.


