News August 28, 2024
కవితకు బెయిల్.. కాంగ్రెస్‌కు ప్లస్సా?
TG: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కాస్త కాంగ్రెస్‌కు సానుకూలంగా మారే అవకాశం ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని చర్చ నడుస్తోంది. బెయిల్ రావడంతో బీఆర్ఎస్, BJP ఒక్కటేనని పలువురు నేతలు పేర్కొనడం దీనికి మరింత ఊతమిస్తోంది. దీంతో కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలోనూ బలం పెరిగే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
Similar News
News September 12, 2024
వినాయక చవితి వేడుకల్లో హిట్‌మ్యాన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వినాయక చవితి వేడుకల్లో సందడి చేశారు. తన ఇంట్లోనే గణపతి విగ్రహం ప్రతిష్ఠించి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం హిట్‌మ్యాన్ సిద్ధమవుతున్నారు. ఎక్కువసేపు జిమ్, మైదానంలోనే ఆయన గడుపుతున్నారు.
News September 12, 2024
బంగ్లాతో తొలి టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే?
ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీమ్ ఇండియా తుది జట్టు ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
News September 12, 2024
సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు
1686: మొఘల్ సామ్రాజ్యంలో బీజాపూరు రాజ్యం విలీనం
1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం
1967: నటి అమల అక్కినేని జననం
1997: నటి శాన్వీ మేఘన జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం
2009: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం