News August 22, 2025
KCRపై నల్గొండ యువకుడి అభిమానం..!

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాచ్య తండా గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు లావూరి భంగ్య నాయక్ మాజీ సీఎం KCR పేరును తన వరి పొలంలో నాటి అభిమానాన్ని చాటుకున్నారు. 9 సంవత్సరాల నుంచి కేసీఆర్‌పై అభిమానంతో వరి నారు నాటుతున్నానని తెలిపారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై కృషి చేస్తామని భంగ్య నాయక్ తెలిపారు.
Similar News
News January 19, 2026
శివపార్వతుల నిత్య నివాసం, మోక్ష క్షేత్రం ‘వారణాసి’

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు కైలాసం వదిలి గంగాతీరంలోని కాశీని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. అందుకే కాశీ శివపార్వతుల గృహంగా, మోక్ష నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. జీవన్మరణాల సంగమమైన ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
News January 19, 2026
సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!
News January 19, 2026
NZB: సంక్రాంతి ఎఫెక్ట్.. రూ. 27.89 కోట్ల మద్యం విక్రయం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పండుగ సందర్భంగా రూ. 27.89 కోట్ల మద్యం అమ్ముడుపోయిందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 151 వైన్స్‌లు, 29 బార్ల యజమానులు పండుగను పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి మాక్లూర్ మండలంలోని IML డిపో నుంచి మద్యం స్టాక్ కొనుగోలు చేశారు. ఈ మేరకు ఈ నెల 12న రూ. 7.62 కోట్లు, 13న రూ. 4.82 కోట్లు, 14న రూ.6.87 కోట్లు, 16న రూ. 8.08 కోట్ల మద్యాన్ని కొన్నారు.


