News April 26, 2024

ఎంపీ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం.. ఇదే తొలిసారి!

image

TG: లోక్‌సభ ఎన్నికలకు KCR ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. 2001లో TRS ఆవిర్భావం తర్వాత 2004 ఎన్నికల్లో KCR కరీంనగర్ MPగా గెలిచారు. 2006, 2008 ఉపఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009లో మహబూబ్‌నగర్ MPగా ఎన్నికయ్యారు. 2014లో గజ్వేల్ MLAగా, మెదక్ MPగా గెలిచి, MP పదవికి రాజీనామా చేశారు. 2014లో ఆయన కుమార్తె కవిత NZB MPగా గెలుపొందారు. 2019లో ఓడిపోగా, ఈసారి పోటీలో లేరు.

Similar News

News April 14, 2026

గొప్ప ఆర్థికవేత్త అంబేడ్కర్!

image

భారత రాజ్యాంగ నిర్మాతగా అందరికీ తెలిసిన Dr.BR అంబేడ్కర్ గొప్ప ఆర్థికవేత్త కూడా. 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ కోసం ఆయన రాసిన ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ పుస్తకం IND, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదపడింది. దేశంలో RBI ఏర్పాటుకూ సహకరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక దోపిడీ, భారతీయులను ఆర్థిక బానిసలుగా మార్చిన తీరును తన పరిశోధనలతో ప్రపంచానికి చాటారు. ఇవాళ ఆ మహనీయుడి జయంతి.

News April 14, 2026

క్రీమ్ బిస్కెట్లు తింటున్నారా?

image

అందరూ ఇష్టంగా తినే క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు బిస్కెట్లను అతికించేందుకు సింథటిక్ ఎమల్సిఫయర్స్‌ను రేప్ సీడ్ ఆయిల్‌తో కలిపి క్రీమ్‌ను తయారుచేస్తారంటున్నారు. ‘వీటిని ఎక్కువగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి డయాబెటిస్, ఫ్యాటీ లివర్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News April 14, 2026

3K టు 152K.. రఫేల్‌లా దూసుకెళ్లిన ప్రఫుల్ ఫాలోయింగ్

image

నిన్న RRపై తొలి ఓవర్లోనే 3 వికెట్లు, మొత్తంగా 4 వికెట్లు కూల్చిన <<19644312>>ప్రఫుల్(SRH)<<>> ఇన్‌స్టాలో రఫేల్‌లా దూసుకెళ్లారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆయన అకౌంట్‌కు కేవలం 3 వేల ఫాలోవర్లు ఉండగా గంటల్లోనే ఆ సంఖ్య 152Kకు చేరింది. ఐపీఎల్ పవర్ ఇదేనని, 4 ఓవర్ల బౌలింగ్ ఆయన లైఫ్‌నే మార్చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇలాగే ప్రదర్శన చేస్తే తిరుగుండదని పేర్కొంటున్నారు. మీరేమంటారు?