News April 20, 2024

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు: కిషన్‌రెడ్డి

image

TG: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చాలా బలహీనపడిందని, దాదాపు కనుమరుగైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘5 నెలలు గడిచినా.. కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ కూరుకుపోయింది. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది’ అని ఆరోపించారు.

Similar News

News December 10, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 10, 2025

ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఢిల్లీ <<>>కంటోన్మెంట్ బోర్డ్ 25 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MBBS,MD/MS/DM/DNB,MCh, పీజీ డిప్లొమా , ఫిజియోథెరపిస్ట్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://delhi.cantt.gov.in

News December 10, 2025

వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

image

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.