News April 27, 2024
KCR, KTR – ఫ్రస్ట్రేషన్ ఉన్నారు: జగ్గారెడ్డి

అధికారం లేదని KCR, KTR – ఫ్రస్ట్రేషన్ ఉన్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. BRS ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. KCR, KTR బస్సు ఎక్కి మహిళతో మాట్లాడితే.. ఉచిత బస్సు ఎలా అమలవుతుందో తెలుస్తుందని అన్నారు.
Similar News
News April 14, 2026
మెదక్: హైవేపై మరమ్మత్తులను పరిశీలించిన కలెక్టర్

మెదక్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న నేషనల్ హైవే 765-డీజీ రోడ్డు మరమ్మత్ పనులను కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 14, 2026
మెదక్: వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి: కలెక్టర్

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడదెబ్బ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు.
News April 14, 2026
మెదక్: రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ

అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రారంభించారు.


