News April 27, 2024
ట్విటర్(X)లోకి కేసీఆర్ ఎంట్రీ

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ట్విటర్(X) ఖాతా తెరిచారు. ఇప్పటికే ఫేస్‌బుక్ పేజీ కలిగి ఉన్న ఆయన ఇప్పుడు Xలోకి అడుగుపెట్టారు. మాజీ మంత్రి, తన తనయుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్దరి అకౌంట్లను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. కేసీఆర్ Xలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు ఆయన అకౌంట్‌ను అనుసరించడం మొదలుపెట్టారు.
Similar News
News April 12, 2026
అమరావతికి ₹3,165 కోట్లు ఇచ్చాం: WB

AP: అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹3,165 కోట్లు విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. పనుల పురోగతిని బట్టి దశలవారీగా మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్, 29 ఏళ్ల మెచ్యూరిటీతో లోన్ మంజూరు చేసినట్లు చెప్పారు. 2031 జూన్ 15 నుంచి రీపేమెంట్ గడువు స్టార్ట్ అవుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారేలా నగరానికి సహకరిస్తామని తెలిపారు.
News April 12, 2026
ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It
News April 12, 2026
‘డెకాయిట్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. షానియెల్ డియో డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు రూ.15కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.


