News August 5, 2024

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. తన అరెస్ట్ అక్రమమంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు, ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయనకు కోర్టు ఆగష్టు 8 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 17, 2025

95 శాతం పోస్టులు స్థానికులకే!

image

AP: రాష్ట్రంలో ఇకపై 95% ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు స్థానికులకే దక్కనున్నాయి. మరో 5% ఓపెన్ కోటాలో ఉండనున్నాయి. ఈ మేరకు AP కొత్త పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025 గెజిట్‌ను కేంద్రం జారీ చేసింది. డైరెక్ట్ నియామకాల్లో స్థానిక, స్థానికేతర కోటాతోపాటు జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులను నిర్దేశించింది. గతంలో 4 జోన్లు ఉండగా తాజాగా 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా మార్చింది.

News December 17, 2025

స్థానికత గుర్తింపు ఇలా..

image

AP: ఉద్యోగ నియామకాల్లో స్థానికతపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. గతంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతంలో స్థానికులుగా నిర్ణయించేవారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో స్థానికత నిర్ణయించేందుకు నివాస ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు ఉద్యోగుల విభజన విషయంలో ఛాయిస్ ఎంప్లాయీస్‌కే ఇవ్వనున్నారు.

News December 17, 2025

8,113పోస్టులు.. CBAT షెడ్యూల్ విడుదల

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది విడుదల చేసిన 8,113 <>NTPC<<>> పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ అందించింది. డిసెంబర్ 15న సీబీటీ 2 ఫలితాలు విడుదల చేయగా.. తాజాగా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(CBAT)ను డిసెంబర్ 28న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్ నుంచి తీసుకోవచ్చని తెలిపింది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in