News June 16, 2024
మోదీపై కేరళ కాంగ్రెస్ సెటైర్

‘చివరికి దేవుడిని కలిసే అవకాశం పోప్‌కి వచ్చింది!’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీపై కేరళ కాంగ్రెస్ సెటైర్ వేసింది. ఇటలీ పర్యటనలో భాగంగా పోప్ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. అప్పుడు తీసిన ఫొటోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇటీవల ఎన్నికల సందర్భంగా ఒడిశా బీజేపీ నేత సంబిత్ పాత్ర ‘పూరీ జగన్నాథుడు కూడా మోదీకి భక్తుడే’ అని వ్యాఖ్యానించడాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News January 12, 2026
ఆర్సీబీ ఘన విజయం

WPL-2026లో యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. ఓపెనర్ హారిస్(85) 10 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా మరో ఓపెనర్ స్మృతి(47*) ఆమెకు సహకారం అందించారు. హారిస్ ఔటైనా రిచా(4*)తో కలిసి స్మృతి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇది ఆర్సీబీకి వరుసగా రెండో విజయం. మరోవైపు యూపీ ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.
News January 12, 2026
Gen Zలో ఎంతో క్రియేటివిటీ: మోదీ

Gen Z క్రియేటివిటీతో నిండి ఉందని PM మోదీ అన్నారు. వినూత్న ఆలోచనలు, ఉత్సాహంతో జాతి నిర్మాణంలో యువశక్తి ముందంజలో ఉందని చెప్పారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో ఆయన మాట్లాడారు. యువతను దృష్టిలో పెట్టుకొని వరుసగా పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. దీంతో దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందన్నారు. కల్చర్, కంటెంట్, క్రియేటివిటీతో కూడిన ఆరెంజ్ ఎకానమీలో దేశం అద్భుత వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు.
News January 12, 2026
ALERT: ఈ కోడ్స్‌తో కాల్స్ చేయొద్దు!

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్‌కు తెరలేపారు. డెలివరీ ఏజెంట్లమని చెబుతూ USSD కోడ్‌లతో కాల్స్ చేయించి యూజర్ల OTPలు తమకు వచ్చేలా చేస్తున్నారు. తర్వాత ఆయా ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్నారు. 21, 61, 67 వంటి USSD కోడ్‌లతో మొదలయ్యే నంబర్లకు డయల్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిందని భావిస్తే ##002#కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయాలని చెబుతున్నారు.


