News December 13, 2024
రేపు కీలక ప్రకటన: మంచు విష్ణు
మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదం నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తాను ఓ ప్రకటన విడుదల చేస్తానని వెల్లడించారు. తాను చేసే ప్రకటన మనసుకు చాలా దగ్గరగా ఉంటుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో విష్ణు ఎలాంటి విషయం వెల్లడించబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Similar News
News January 21, 2025
నేడు KRMB కీలక సమావేశం
కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB) నేడు హైదరాబాద్ జలసౌధలో కీలక సమావేశం కానుంది. ఇప్పటికే 2సార్లు వాయిదా పడిన ఈ భేటీ ఉ.11గంటలకు జరగనుంది. నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా, తనిఖీలు, పర్యవేక్షణ తమ పరిధిలోనే ఉండాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అటు సాగర్, శ్రీశైలంలోని కాంపొనెంట్లను కృష్ణాబోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ CRPFకు ఇవ్వాలని AP కోరుతోంది. ఈ అంశాలే అజెండాగా భేటీ జరగనుంది.
News January 21, 2025
ఆ పెన్షన్ దారులందరికీ వైద్య పరీక్షలు
AP: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.
News January 21, 2025
6.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనాలు
AP: తిరుమలలో పది రోజుల పాటు శ్రీవారిని 6,83,304 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా రూ.34.43కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియగా, సోమవారం తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలను టీటీడీ ప్రారంభించింది.