News May 7, 2025
వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారం స్వాధీనం!

AP: ఒంగోలులో మూడు రోజుల క్రితం టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితులు వాడిన స్కూటీ లభ్యమైంది. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా విచారణ వేగవంతం చేశారు. హత్య సమయంలో నిందితులు 2 స్కూటీలపై వచ్చి ఒకటి దాబా దగ్గర వదిలి వెళ్లగా, దానిపై రక్తం మరకలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 15, 2026
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా భక్తులు <<19142196>>ఉపవాస దీక్షలు<<>> ఆచరిస్తారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు’ అని చెబుతున్నారు. ఉపవాసం తర్వాత భారీగా తినొద్దని, ముందు తేలికైన ఆహారంతో ప్రారంభించాలని పేర్కొంటున్నారు.
News February 15, 2026
ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జననం
1861: UK గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం
2022: మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లాహిరి మరణం (ఫొటోలో)
News February 15, 2026
చిరంజీవి సినిమాలో ‘ఛాంపియన్’ హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో <<18950253>>మరో సినిమా<<>> తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో చిరు కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. కీలకమైన కూతురు క్యారెక్టర్ కోసం ‘ఛాంపియన్’ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కృతి శెట్టి, సారా అర్జున్ పేర్లనూ పరిశీలించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.


