News October 18, 2024
వరల్డ్ ఎకానమీలో భారత వృద్ధి కీ రోల్: అజయ్ బంగా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత వృద్ధి రేటు అత్యంత కీలకమని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో 6-7% కంటే ఎక్కువ వృద్ధిని చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో ఎక్కువగా డొమెస్టిక్ మార్కెట్‌పై ఆధారపడి ఉందని, ఇదొక ఆరోగ్యకరమైన సంకేతమని పేర్కొన్నారు. క్వాలిటీ లైఫ్‌పై భారత్ పనిచేయాల్సి ఉందని చెప్పారు. దీనిపై రానున్న నెలల్లో సానుకూల ఫలితాలను చూడబోతున్నామన్నారు.
Similar News
News November 12, 2024
EPF, EPS కాంట్రిబ్యూషన్ లిమిట్ పెంచితే ఉద్యోగికి నష్టమా?
EPF బేసిక్ పే లిమిట్ రూ.15K నుంచి రూ.21Kకు పెంచే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ లిమిట్ దాటినవాళ్ల ఎంప్లాయీ (12%), ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ (12%) EPFలోనే జమ అవుతున్నాయి. లిమిట్ లోపు ఉన్నవాళ్ల ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్‌లో 8.33% అంటే గరిష్ఠంగా రూ.1250 EPSకు వెళ్తుంది. లిమిట్ పెంచితే ఇది రూ.1749 వరకు పెరుగుతుంది. దీంతో EPF తగ్గి EPS కార్పస్ పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పింఛన్ లభిస్తుంది.
News November 12, 2024
ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దయ్యేది అక్రమంగా ఉంటున్న వారికే..
USలో ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దవుతుందనే వార్తలు భారతీయులను కలవరపెడుతున్నాయి. రూల్స్ ప్రకారం దంపతులకు గ్రీన్ కార్డు, H1B, స్టూడెంట్ వీసా లేకపోయినా అక్కడ పిల్లలు జన్మిస్తే ఆ శిశువుకు నేరుగా ఆ దేశ పౌరసత్వం వచ్చేస్తుంది. అనంతరం తల్లిదండ్రులకు కూడా సిటిజన్‌షిప్ లభిస్తుంది. ఈ నిబంధనను ట్రంప్ మారుస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అక్రమంగా ఉంటున్న వారి గురించి మాత్రమే ట్రంప్ ప్రచారంలో ప్రస్తావించారు.
News November 12, 2024
లగచర్ల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఉద్యోగ సంఘాల జేఏసీ DGPకి ఫిర్యాదు చేసింది. అధికారులపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు DGPకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు 55 మందిని అరెస్ట్ చేయగా, ఉద్రిక్తతల నేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.