News July 5, 2024
ఎంపీగా ప్రమాణం చేసిన ఖలిస్థానీ అమృత్‌పాల్

ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు టెర్రర్ ఫండింగ్ కేసులో జైలుకెళ్లిన కశ్మీరీ నేత ఇంజనీర్ రషీద్ కూడా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖడూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి అమృత్‌పాల్, బారాముల్లా స్థానం నుంచి రషీద్ ఎంపీలుగా గెలుపొందారు. కానీ వీరు జైల్లో ఉండటంతో మిగతా ఎంపీలతో ప్రమాణం చేయలేకపోయారు. ఇప్పుడు పెరోల్‌పై పార్లమెంట్‌కు వచ్చి ప్రమాణం చేశారు.
Similar News
News December 17, 2025
APPLY NOW: ICMRలో 28 పోస్టులు

<
News December 17, 2025
టోనర్ ఎంపిక ఇలా..

ప్రస్తుతం స్కిన్‌కేర్‌పై అందరికీ అవగాహన పెరిగింది. దీంట్లో ముఖ్యమైనది టోనర్. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడిచర్మం ఉన్నవారు తేమను అందించే టోనర్, సున్నితచర్మం ఉన్నవారు కలబంద, చామంతి గుణాలున్నవి, జిడ్డు చర్మం ఉన్నవారు తాజాదనాన్ని కలిగించేవి ఎంచుకోవాలి. ఆల్కహాల్, పారాబెన్స్, బెంజైల్ పెరాక్సైడ్ వంటివి హాని చేస్తాయి. కాబట్టి టోనర్‌లో ఇవి లేకుండా చూసుకోవాలి. <<-se>>#SkinCare<<>>
News December 17, 2025
మీ బ్రెయిన్ వయస్సుని ఇలా తగ్గించుకోండి

వయస్సు పెరగడం సహజమే. కానీ బ్రెయిన్‌ను యవ్వనంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. USకు చెందిన ఫ్లోరిడా వర్సిటీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించిన వారి మెదడు వాస్తవ వయస్సు కంటే 8 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మంచి నిద్ర, సరైన బరువు, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచినట్లు తేలింది. తద్వారా ఓల్డేజ్‌లో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.


