News April 25, 2024
‘సలార్-2’లో కియారా అద్వానీ?

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో సలార్‌కి కొనసాగింపుగా రాబోతున్న ‘సలార్-2’ గురించి మరో ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సెకండ్ పార్ట్‌లో రెబల్ స్టార్ సరసన నటించనున్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ఓ స్పెషల్ సాంగ్‌లోనూ ఆమె కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కియారా గేమ్‌ఛేంజర్, వార్-2లో నటిస్తున్నారు.
Similar News
News April 16, 2026
వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.
News April 16, 2026
మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.