News September 13, 2025

బీసీసీఐ అధ్యక్షుడిగా కిరణ్ మోరే?

image

BCCI తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల అసోసియేషన్‌లు ఇందుకు పాజిటివ్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఎన్నికలు జరగకపోవచ్చని, ఏకగ్రీవం అయ్యే ఛాన్సుందని ఇటీవల IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా అభిప్రాయపడ్డారు. కిరణ్ మోరే IND తరఫున 49 టెస్టులు, 94 ODIలు ఆడారు. 1988, 1991 ఆసియా కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు.

Similar News

News December 10, 2025

ఇంటి చిట్కాలు

image

* ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో తీసుకుని కలిపి, ఈ మిశ్రమంతో ఫర్నిచర్ తుడవాలి.
* బొద్దింకలు ఉన్న ప్రదేశాల్లో కీరదోసను ముక్కలుగా కోసి ఉంచితే బొద్దింకలు మళ్లీ కనిపించవు.
* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు తగ్గుతాయి.
* డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే ఈగలు తగ్గుతాయి.

News December 10, 2025

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రంలో కోడిపుంజు ఎందుకు?

image

కార్తికేయుడి వాహనం నెమలి అని అందరికీ తెలుసు. అయితే ఆయన చిత్రాల్లో ఆ పక్షితో పాటు కోడిపుంజు కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడిని సంహరించేటప్పుడు ఆ రాక్షసుడు చెట్టు రూపంలో మారాడు. కార్తికేయుడు తన ఆయుధంతో ఆ చెట్టును చీల్చగా ఓ భాగం నెమలి, మరో భాగం కోడిపుంజుగా మారాయి. నెమలిని ఆయన తన వాహనంగా చేసుకున్నాడు. కోడిపుంజుని ధ్వజంగా స్వీకరించాడు. అలా కార్తికేయునికి కోడిపుంజుతో అనుబంధం ఏర్పడింది.

News December 10, 2025

ప్రాణాలు తీసిన గ్యాస్ గీజర్లు

image

గ్యాస్ గీజర్లు కారణంగా 2 వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరులో 26 ఏళ్ల చాందినీతో పాటు నాలుగేళ్ల కుమార్తె గీజర్ గ్యాస్ లీక్ అయి ప్రాణాలు కోల్పోయారు. UPలోని బఘ్‌పట్‌లో అభిషేక్‌ అనే యువకుడు బాత్‌రూమ్‌లో గీజర్ నుంచి వెలువడిన గ్యాస్ వల్ల మృతిచెందాడు. తలుపును పగులగొట్టి బయటకు తీసేలోపే చనిపోయాడు. క్లోజ్డ్ బాత్‌రూమ్‌లో గ్యాస్ <<18108885>>గీజర్<<>> వినియోగం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.