News May 14, 2024

DCతో మ్యాచుకు KL రాహుల్ దూరం?

image

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు జరగనున్న DCvsLSG మ్యాచ్‌కు రాహుల్ దూరం కానున్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లిన జట్టు సభ్యుల్లో ఆయన కనిపించకపోవడమే ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. SRHతో ఓటమి తర్వాత LSG జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా డగౌట్‌ వద్ద రాహుల్‌పై సీరియస్ అయిన విషయం తెలిసిందే.

Similar News

News December 15, 2025

గోదాదేవి రచించిన పాశురాల గురించి తెలుసా?

image

దైవారాధనకు కఠిన దీక్షలు అవసరం లేదని, స్వచ్ఛమైన ప్రేమతో కూడా దేవుడిని వశం చేసుకోవచ్చని గోదాదేవి నిరూపించింది. ఆమె అత్యంత సులభమైన వ్రతాన్ని ఆచరించి కృష్ణుడిని భర్తగా పొందింది. తాను ధరించిన పూల మాలను కృష్ణుడికి సమర్పించింది. ఆమె రచించిన 30 పాశురాలనే ‘తిరుప్పావై’ అంటారు. పెళ్లికాని యువతులు రోజుకొకటి చొప్పున 30 పాశురాలు ఆలపిస్తే సద్గుణాల భర్త వస్తాడట. రేపటి నుంచి భక్తి కేటగిరీలో పాశురాలను చూడొచ్చు.

News December 15, 2025

కోళ్లకు వ్యాధుల ముప్పు తగ్గాలంటే?

image

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.

News December 15, 2025

త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన: మహేశ్ గౌడ్

image

TG: త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రుల మార్పు, చేర్పుపై తనకు స్పష్టత లేదని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్, అధిష్ఠానం మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక అని చెప్పారు.