News August 2, 2024

KMM: ఇదే చివరి అవకాశం

image

DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. అయితే స్పెషల్ విడత ద్వారా రిజిస్ట్రేషన్‌కు గడువు నేటితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని SR&BJNR ప్రిన్సిపల్ మహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈనెల 6న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.

Similar News

News December 7, 2025

మూడో విడత ఎన్నికలు.. 906 నామినేషన్లు ఆమోదం

image

ఖమ్మం జిల్లాలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 7 మండలాల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను శనివారం అధికారులు పూర్తి చేశారు. ఇందులో సర్పంచ్ 906, వార్డుల స్థానాలకు దాఖలైన 4010 నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈనెల 9న మధ్యాహ్నం 3 లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

News December 7, 2025

రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 23 సర్పంచ్, 306 వార్డులు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కామేపల్లి S-6 W-67, ఖమ్మం రూరల్ S-2 W-22, కూసుమంచి S-6 W-87, ముదిగొండ S-1 W-27, నేలకొండపల్లి S-3 W-50, తిరుమలాయపాలెం S-5 W-53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 6 మండలాల్లో మిగిలిన 160 సర్పంచ్, 1380 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నిక జరగనుంది.

News December 7, 2025

ఏకగ్రీవ పంచాయతీలలోనూ ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులో ఉంటుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ స్పష్టం చేశారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఈ ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.