News August 14, 2025

KMM: ఏడున్నర గంటల్లో 31.6 MM వర్షపాతం నమోదు

image

ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రఘునాథపాలెం 7.1, సత్తుపల్లి 6.1, సింగరేణి 5.0, KMM(R) 3.5, తిరుమలాయపాలెం 3.0, వేంసూరు 2.5, కల్లూరు 2.0, కొణిజర్ల 1.4, పెనుబల్లి 0.8, KMM(U) 0.2 మిల్లీమీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News March 10, 2026

ఖమ్మం జిల్లాలో తొలి ‘కుసుమ్’ సోలార్ ప్లాంట్ ప్రారంభం

image

తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో ప్రధానమంత్రి కుసుమ్ (PM-KUSUM) పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్స్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను మంగళవారం ప్రారంభించారు. రైతు బీరవల్లి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. జిల్లాలో ఈ పథకం కింద ప్రారంభమైన తొలి సోలార్ ప్లాంట్ ఇదే. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News March 10, 2026

ఖమ్మం: ఇంటర్‌ పరీక్షలో విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసు

image

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఓ విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని ఓ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డీఐఈఓ రవిబాబు వెల్లడించారు. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,849 మంది హాజరుకాగా, 502 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News March 10, 2026

ఖమ్మం: చెక్కు బౌన్స్‌.. నిందితుడికి జైలు శిక్ష

image

చెక్కు బౌన్స్‌ కేసులో శ్రీరాంనగర్‌కు చెందిన జి.విద్యాసాగర్‌కు ఖమ్మం కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2017లో బానోత్ శరత్ వద్ద తీసుకున్న రూ.2 లక్షల అప్పు కోసం విద్యాసాగర్ ఇచ్చిన చెక్కు తిరస్కరణకు గురైంది. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి బెక్కమ్ రజని నిందితుడికి 3 నెలల జైలు శిక్షతో పాటు, బాధితుడికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పునిచ్చారు.