News April 21, 2024
KMM: గీత దాటితే కొరడా ఝళిపిస్తారు ..!!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ప్రవర్తన నియమావళి అమలు అవుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. ప్రవర్తన నియమావళికి లోబడి పార్టీలు అభ్యర్థులు నడుచుకోవలసి ఉంటుంది. ప్రచార సమయంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలను అధికారులు షాడో బృందాల ద్వారా నమోదు చేస్తున్నారు. ఒకవేళ గీత దాటితే చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.
Similar News
News December 11, 2025
OFFICIAL: మొదటి విడత పోలింగ్ 90.08 శాతం నమోదు

మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఖమ్మం జిల్లాలో 90.08 శాతం నమోదైందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనకల్ మండలంలో 90.85 శాతం, చింతకాని మండలంలో 91.05 శాతం, కొణిజెర్ల మండలంలో 89.61 శాతం, మధిర మండలంలో 90.08 శాతం, రఘునాథపాలెం మండలంలో 91.09 శాతం, వైరా మండలంలో 90.67 శాతం, ఎర్రుపాలెం మండలంలో 87.28 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 11, 2025
6 వేల మందికి పైగా బైండోవర్ చేశాం: ఖమ్మం సీపీ

జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రశాంతంగా వున్న గ్రామాల్లో సమస్య సృష్టించే వ్యక్తులను ముందుస్తుగానే 6 వేల మందికి పైగా బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
News December 11, 2025
ఖమ్మం జిల్లాలో తొలి సర్పంచి విజయం

రఘునాథపాలెం మండలంలో ఓ సర్పంచ్ ఫలితం వెలువడింది. ఈరోజు జరిగిన ఎన్నికలో లచ్చిరాం తండాలో ప్రజలు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మాలోతు సుశీల వైపు మొగ్గు చూపారు. 42 ఓట్ల తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.


