News February 12, 2025

KMM: పారిశుద్ధ్యంపై.. ఆలోచింపజేస్తున్న బొమ్మలు

image

ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం కాల్వ ఒడ్డు నుంచి పాత బస్టాండ్ రైల్వే ఫ్లై ఓవర్‌పై క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల కింద గోడల మీద గీసిన పెయింటింగ్ బొమ్మలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రయాణికులు, ప్రజలు వీటిని చూసి బాగున్నాయని కితాబు ఇస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్యానికి ప్రజలు తమ వంతుగా పాటుపడాలని కోరుతున్నారు.

Similar News

News February 12, 2025

KMM: 10th అర్హతతో 51 GOVT జాబ్స్

image

ఖమ్మం డివిజన్‌‌లో 48 GDS, 3 డాక్ సేవక్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SHARE IT

News February 12, 2025

వైరా: నిలిచిపోయిన బీర్ల సరఫరా!

image

వైరాలోని IMFL డిపో నుంచి మంగళవారం బీర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.150గా ఉన్న లైట్ బీర్ బాటిల్ ధర రూ.180కి, స్ట్రాంగ్ బీర్ బాటిల్ ధర రూ.40 మేర పెంచుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బార్లు, వైన్స్‌ల నిర్వాహకులు బీర్ల స్టాక్ తీసుకెళ్లలేదు. బుధవారం స్టాక్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News February 12, 2025

ఖమ్మం: చెక్‌పోస్టులతో కోళ్ల దిగుమతికి కట్టడి

image

ఏపీలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాతోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. అయితే సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట తదితర మండల్లాలోని పౌల్ట్రీఫామ్‌ల్లోనూ కోళ్లు మృతిచెందగా దీనికి వైరసే కారణమని నిర్ధారణ కాలేదు. కానీ ఏపీ నుంచి కోడిపిల్లలు, కోళ్లు, దాణా దిగుమతి అవుతుండడంతో చెక్‌పోస్టుల ద్వారా అధికారులు వాటిని కట్టడి చేస్తున్నారు.

error: Content is protected !!