News October 6, 2025

KMM: పొలంలో నీరు.. రైతు కంట కన్నీరు.!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలకు పత్తి, ఉల్లి, వేరుశనగ పంట పొలాల్లో నీరు నిలిచి పూర్తిగా నాశనం అయ్యాయి. చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతినడంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News January 18, 2026

తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 18, 2026

కొల్లూరు: సైన్స్ ఫెయిర్‌కు 210 మంది

image

కొల్లూరులో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. పాఠశాలలో ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఆరు రాష్ట్రాల నుంచి 210 విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారని చెప్పారు. సైన్స్ ఫెయిర్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

News January 18, 2026

తెర్పోల్ చెరువులో దూకి వ్యక్తి మృతి

image

కొండాపూర్‌కు చెందిన దొబ్బల రాజు గత నెల 31వ తేదీన గ్రామ శివారులోని దర్గాకు వెళ్లి తిరిగి రాలేదు. వెతికిన ఆచూకీ లభించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం తెర్పోల్ శివారులో చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.