News April 20, 2024
KMM: BRS రెబల్ అభ్యర్థిగా బాజిబాబా నామినేషన్

ఖమ్మం MP స్వతంత్ర అభ్యర్థిగా BRS జిల్లా విద్యార్థి విభాగం అద్యక్షుడు షేక్ బాజిబాబా నామినేషన్ దాఖలు చేసారు. జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ముస్లింలకు MP టికెట్ ఇవ్వాలని జిల్లా ముస్లిం మైనార్టీలు కేసీఆర్‌ను విన్నవించారని, కానీ వారి విజ్ఞప్తిని కేసీఆర్ తోసిపుచ్చారని అన్నారు. తమ గొంతును వినిపించేందుకు రెబల్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు.
Similar News
News December 8, 2025
ఖమ్మం: 1064 టోల్‌ఫ్రీతో అవినీతికి అడ్డుకట్ట: కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా పోస్టర్‌లను సోమవారం ఆవిష్కరించారు. 1064 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతిని అరికట్టవచ్చని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ఏ పనికైనా లంచం ఇవ్వొద్దని, ఎవరైనా వేధిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ రమేష్, అధికారులు పాల్గొన్నారు.
News December 8, 2025
ఖమ్మం: అవినీతి ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్: కలెక్టర్

అవినీతి నిరోధక శాఖ (ACB) వారోత్సవాల సందర్భంగా సోమవారం (డిసెంబర్ 8న) కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ACB పోస్టర్‌ను విడుదల చేశారు. అవినీతిపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064 తో పాటు, వాట్సాప్, ఈమెయిల్ మరియు ACB ఖమ్మం DSP నంబర్ (9154388981) ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
News December 8, 2025
ఖమ్మం: మద్యం దుకాణాలు బంద్

డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.


