News December 14, 2025

KMR: ఉత్కంఠ పోరు.. GP పీఠం కోసం నానా తంటాలు!

image

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న 2వ విడత GP ఎన్నికలు పలు చోట్ల అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అత్యంత రసవత్తరంగా సాగుతున్న ఈ పోరులో అభ్యర్థులు విజయం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నదైనా, పెద్దదైనా గ్రామ పంచాయతీ పీఠాన్ని దక్కించుకోవడానికి అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, అనుసరిస్తున్న వ్యూహాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Similar News

News January 13, 2026

గ‌ర్భిణులు నువ్వులు తిన‌కూడ‌దా?

image

పండుగ పిండివంటల్లో ఎక్కువగా నువ్వులను వాడుతుంటారు. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్యాలకు చెక్ పెడతాయి. అయితే గర్భిణులు మాత్రం నువ్వులు తినకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే గర్భిణులు నువ్వులు తినడం వల్ల గర్భాధారణ సమయంలో తల్లికి అవసరం అయ్యే పోషకాలు, క్యాల్షియం, విటమిన్స్, అమినోయాసిడ్స్, ప్రోటీన్స్, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి. కానీ చాలా మితంగా తీసుకోవాలి.

News January 13, 2026

HYD: స్మోకింగ్ చేయకపోయినా క్యాన్సర్

image

MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్, సర్విక్స్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు స్మోకింగ్ చేసేవారికే వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు తాగనివారి జీవితాలనూ కబళిస్తోంది. HYDలో మహిళల్లో, ముఖ్యంగా స్మోకింగ్ అలవాటులేనివారిలోనూ కేసులు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం, ఇరుకు కిచెన్‌లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, చెత్త దహనం, ధూళి ప్రధాన కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

News January 13, 2026

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

image

ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ రిటైర్మెంట్ ప్రకటించారు. మార్చిలో టీమ్ ఇండియాతో జరగబోయే హోమ్ సిరీస్‌ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానన్నారు. 15ఏళ్ల కెరీర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 300దాకా మ్యాచులాడారు. 7వేలకు పైగా రన్స్ చేశారు. 275మందిని ఔట్ చేశారు. ’35 ఏళ్ల వయసులోనూ AUS తరఫున ఆడాలనే ఉంది. కానీ నాలో పోటీతత్వం సన్నగిల్లింది’ అని అన్నారు.