News May 7, 2025
KMR: ఉమ్మడి జిల్లాలో హోంగార్డుల బదిలీలు

కామారెడ్డి జిల్లాలో పలువురు హోంగార్డులు బదిలీ అయ్యారు. మొత్తం 38 మంది హోంగార్డులను డ్రా పద్ధతిలో బదిలీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ నుంచి కామారెడ్డికి 38 మంది బదిలీ కాగా.. కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు అంతే మంది వెళ్లనున్నారు. గతంలో జిల్లాల పునర్విభజన సమయంలో హోంగార్డులకు సంబంధించి ఈ బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. దీని ప్రకారం డ్రా పద్ధతిలో వరుసగా సిబ్బందిని పరస్పర బదిలీలు చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
సంగారెడ్డి: ఓటర్ల సర్వేలో వేగం పెంచాలి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 51.96 శాతం సర్వే మాత్రమే పూర్తయిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పురోగతి తక్కువగా ఉందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా సవరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
News February 18, 2026
పేద మహిళల కోసం ఆర్థిక ప్రోత్సాహం: కలెక్టర్

పేద మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శ్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ పని తీరు, ఆర్థిక ప్రణాళికలు బ్యాంకు లింకేజీ రుణాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రెడిట్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, వేగవంతంగా లోన్ రికవరీ చేయాలని సూచించారు.
News February 18, 2026
PHOTO GALLERY: విశాఖలో మిలాన్-2026 రిహార్సల్స్

AP: విశాఖ సాగరతీరంలో ఈ సాయంత్రం మిలాన్-2026 రిహార్సల్స్ జరిగాయి. యుద్ధనౌకలు సందడి చేశాయి. 45 భారతీయ నౌకలతో పాటు మొత్తం 71 యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. పెద్దఎత్తున విశాఖ ప్రజలు ఈ విన్యాసాలను వీక్షించారు. రేపు మిలాన్-2026 జరగనుంది.


