News March 6, 2025

KMR: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు చెప్పారు. మద్యానికి బానిస కావడంతో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

నల్గొండ: పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు

image

ఇటీవల జరిగిన మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పొత్తులతో కమ్యూనిస్టు పార్టీలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. సీపీఎం 48, సీపీఐ 63, సీపీఐ(ఎంఎల్) మాస్ 10 స్థానాలు గెలుచుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో వీరి ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పొత్తులు కలిసి వచ్చాయి.

News December 16, 2025

MBNR: ఓటు హక్కును వినియోగించుకోండి- ఎస్పీ

image

ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పికెటింగ్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామన్నారు.

News December 16, 2025

ఇప్పటివరకు IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

image

*రూ.27 కోట్లు- రిషభ్ పంత్ (లక్నో)
*రూ.26.75 కోట్లు- శ్రేయస్ అయ్యర్ (పంజాబ్)
*రూ.25.20 కోట్లు- గ్రీన్ (కేకేఆర్)
*రూ.24.75 కోట్లు- స్టార్క్ (కేకేఆర్)
*రూ.23.75 కోట్లు- వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
*రూ.20.50 కోట్లు- కమిన్స్ (SRH) *రూ.18.50 కోట్లు- సామ్ కరన్ (పంజాబ్) *రూ.18 కోట్లు- పతిరణ (కేకేఆర్), అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), చాహల్ (పంజాబ్)