News August 22, 2025
KMR: ఎడ్ల పొలాల అమావాస్య.. మీ ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారు

శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో ‘ఎడ్ల పొలాల అమావాస్య’ ఒకటి. పిట్లం మండలంలో రైతులు ఉదయాన్నే తమ ఎద్దులను శుభ్రం చేసి, కొమ్ములకు రంగులు అద్ది, మెడలో గజ్జెలు, పసుపు, కుంకుమ, పూల దండలతో అలంకరిస్తారు. పిండి వంటలను వాటికి తినిపిస్తారు. అనంతరం వాటికి హారతి ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటారు. సాయంత్రం ఎద్దులను హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేయిస్తారు. మీ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి.
Similar News
News January 13, 2026
షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

జమ్ము కశ్మీర్‌లోని షాక్స్‌గామ్ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్‌గామ్ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.
News January 13, 2026
కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యం: కలెక్టర్ తేజస్

జిల్లాలో మంజూరైన ‘యంగ్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చిలుకూరు, గడ్డిపల్లి, తొండలలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
News January 13, 2026
‘భోగి’ ఎంత శుభ దినమో తెలుసా?

భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమ ‘భోగాన్ని’ పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయమిది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపవశాన రైతుల కోసం భూమికి దిగి వచ్చిన రోజూ ఇదే. ఇలా భక్తి, ప్రకృతి, పురాణాల కలయికే ఈ భోగి పండుగ.


