News September 12, 2025
KMR: కేటీఆర్‌కు చేతనైతే వారితో రాజీనామా చేయించు: మంత్రి సీతక్క

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి సీతక్క అన్నారు. బిక్కనూర్‌లో గురువారం రాత్రి నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేటీఆర్‌కు చేతనైతే అప్పట్లో TDP, కాంగ్రెస్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్‌లతో రాజీనామా చేయించాలన్నారు. తరువాత కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలన్నారు.
Similar News
News December 7, 2025
పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹260గా ఉంది. వరంగల్, కామారెడ్డిలోనూ ఇవే రేట్లున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరులో ₹240-260, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ₹220-230 వరకు పలుకుతోంది. ఇక మటన్ కేజీ ₹800-900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు ధర రిటైల్‌లో ఒక్కోటి ₹7-9కి అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News December 7, 2025
రాష్ట్రంలో 94 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణలో 94 Jr జడ్జీ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిలో 66 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, 28 పోస్టులను ట్రాన్స్‌ఫర్ ద్వారా భర్తీ చేయనున్నారు. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నవారు DEC 29వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: tshc.gov.in
News December 7, 2025
KMR: ఆ మండలాల్లో ప్రచార పర్వానికి 3 రోజులే!

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 3రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 9 సాయంత్రం 5గం.లోపు బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారాన్ని ముగించాల్సిందే. భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో 167 గ్రామ పంచాయతీలకు గాను 11 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 156 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.


