News October 8, 2025

KMR: జిల్లాలో భారీ వర్ష నష్టంపై కేంద్ర బృందం రివ్యూ

image

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం పీకే రాయ్ (జాయింట్ సెక్రెటరీ, హోమ్ అఫైర్స్) నేతృత్వంలో బుధవారం జిల్లాలో పర్యటించింది. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో మీట్ అయ్యారు. 3 రోజుల్లోనే జిల్లాలో సగటు వర్షపాతం 40 శాతం కురిసిందని, దీనివల్ల రహదారులు, వంతెనలు, పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Similar News

News January 17, 2026

కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

image

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.

News January 17, 2026

అన్నమయ్య: టమాటా ధరలు ఢమాల్

image

మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.230 కి పడిపోయింది. శనివారం మార్కెట్ కు 72 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. 10 కిలోల మేలు రకం టమాటాలు – రూ 230, రెండవ రకం రూ – 220, మూడో రకం రూ.190తో కొనుగోలు చేసినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ వెల్లడించారు. టమాటా దిగుబడి తక్కువగా వస్తున్నప్పటికీ రేట్లు పెరగక పోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

News January 17, 2026

రానున్న 5 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని పేర్కొంది. అటు రాష్ట్రంలో నిన్నటి వరకు చలి తీవ్రత తగ్గినట్లు కనిపించగా ఇవాళ పెరిగింది. మరోవైపు ఫిబ్రవరి తొలి వారం నుంచి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.