News December 1, 2025
KMR: జిల్లాలో ’30, 30(ఎ) పోలీసు యాక్ట్’ అమలు

కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు DEC 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని SP హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఎస్పీ కోరారు.
Similar News
News February 17, 2026
జాతీయ స్థాయిలో మెరిసిన కుబీర్ కుర్రోడు

నిన్న విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో దార్ కుబీర్‌కు చెందిన తోకల చంద్రకాంత్ 99.46% పర్సంటైల్ సాధించాడు. ఇతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రైతు కుటుంబంలో పుట్టి ఉత్తమ మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు చంద్రకాంత్‌ను అభినందిస్తున్నారు. చంద్రకాంత్ చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉన్నాడని తండ్రి తోకల మారుతి తెలిపారు.
News February 17, 2026
పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
News February 17, 2026
కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల కాలపట్టికను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల విడుదల చేశారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న మొదటి పేపర్, 27న రెండో పేపర్, మార్చి 2, 5, 7, 9 తేదీల్లో మిగిలిన పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని పేర్కొన్నారు.


