News September 12, 2025
KMR: టాస్ అడ్మిషన్ డ్రైవ్ పై జిల్లా అధికారుల సమీక్ష

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ డ్రైవ్‌లో భాగంగా జిల్లా అబ్జర్వర్, స్టేట్ కోఆర్డినేటర్ క్రాంతి రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్‌ను కలిశారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రాధాన్యత, ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియపై చర్చించారు. చందర్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రాపౌట్స్ విద్యార్థులను గుర్తించి, వారిని చెడు వ్యసనాల బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News December 17, 2025
ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన తాడిపత్రి మండల వాసి

తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఎస్సై నియామకాల్లో ఎంపికయ్యారు. 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో వద్దనుకొని ఏపీలో విధులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతపురం PTC కళాశాలలో ట్రైనింగ్ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు చేపట్టారు.
News December 17, 2025
వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.
News December 17, 2025
దుబ్బా తండా సర్పంచ్‌గా రామ్ నాయక్

దేవరుప్పుల మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దుబ్బతండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లకావత్ రామ్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు.


