News August 22, 2025
KMR: డీజేలు వద్దు.. డప్పులు ముద్దు: SP

గణేశ్ మండపాల వద్ద డీజే బదులుగా.. డప్పు కళాకారులను ఉపయోగించుకోవాలని కామారెడ్డి SP రాజేశ్ చంద్ర సూచించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు తప్పనిసరిగా పోలీస్ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. భద్రత కోసం ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. జిల్లాలో గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయడంలో అందరి సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News January 13, 2026
IIT హైదరాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు

<
News January 13, 2026
20న నెల్లూరు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

నెల్లూరు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, పరిశ్రమలు, మత్స్య, ఉద్యాన, మైక్రోఇరిగేషన్, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఐటీడీఏ, జిల్లా వెనుకబడిన శాఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.
News January 13, 2026
ఇరాన్‌లో రక్తపాతం.. 2,000 మంది మృతి!

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు సుమారు 2,000 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు ‘ఉగ్రవాదులే’ కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంటర్నెట్ నిలిపివేతతో పూర్తి వివరాలు తెలియడం లేదు. అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.


