News November 19, 2025
KMR: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులు బుధవారం నుంచి CCI కేంద్రాలకు పత్తిని తీసుకువెళ్లాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సమస్యల పరిష్కారానికి మంగళవారం ఆయన కీలక సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిన్నింగ్ మిల్లర్లతో చర్చించారు. హామీలను నెరవేరుస్తామని చెప్పడంతో మిల్లుల యజమానులు బంద్ విరమించారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 25, 2026
విడవలూరు: 54 మంది అరెస్ట్

విడవలూరు(M) పెద్దపాలెం బంకింగ్ కెనాల్ వద్ద కోడిపందేల స్థావరాలపై పోలీసులు <<18948979>>దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రబాబు తెలిపారు. వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 2 ఆటోలు,14 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు.
News January 24, 2026
జూన్ లోపు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయాలి: నారాయణ

అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల పనులను వేగవంతం చేసి, జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు.
News January 24, 2026
త్రివర్ణ శోభితంగా నెల్లూరు కార్పొరేషన్

గణతంత్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు నగరం సిద్ధమవుతోంది. జనవరి 26 పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిసరాల్లో ఇంజినీరింగ్ స్ట్రీట్ లైటింగ్ విభాగం ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యాలయ భవనాలను రంగురంగుల కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. జాతీయ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.


